సికింద్రాబాద్ : పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ గురువారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను అందించాగాలిగామని, అన్ని వర్గాలకు చెందిన వారికీ ప్రయోజనం చేకూర్చ గలిగామని తెలిపారు. ఓట్లు, ఎన్నికలు, రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని వేళల్లో ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నామని పద్మారావు గౌడ్ అన్నారు. కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, నేతలు కంది నారాయణ, కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు. 31 మందికి కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్, 13 మందికి సీ ఎం ఆర్ ఎఫ్ తో కలిపి దాదాపు 45 లక్షల రూపాయల విలువచేసే చెక్కులను ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అందించారు.
పేద ప్రజలకు అన్ని సంక్షేమ పధకాలు లభించేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…