SAKSHITHA NEWS

మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్


మహిళలకు డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ లో సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో మహిళలకు తాము శక్తి వంచన లేకుండా ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నామని, మహిళల స్వాలంభానకు కృషి చేస్తున్నామని శ్రీ పద్మారావు గౌడ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో మహిళా పొదుపు సంఘాల కార్యకలాపాలు పురోగతి ప్రస్థానంలో సాగుతున్నాయని, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సితాఫలమండీ, బౌద్దనగర్ డివిజన్లలోని సుమారు 19 వందల సంఘాలకు రూ.20.32 కోట్ల మేరకు రుణ సదుపాయాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు జరిపామని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు తాము కల్పిస్తున్న ప్రాధాన్యతను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ పద్మారావు గౌడ్ సూచించారు


SAKSHITHA NEWS