ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Spread the love

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

*
……..

సాక్షిత : ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు

*దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్దతి కాదు.
నిరాధారంగా మాట్లాడటం ఆరోగ్యకరమైన పద్దతి కాదు

*కేసిఆర్ బిడ్డను బద్నాం చేస్తే, కేసీఆర్ ఆగమైతడని, కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న కేసీఆర్ భయపడుతారేమో అని, బీజేపీ నేతలు ఇలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది పూర్తి వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుంది.

*తెలంగాణ కోసం ఉద్యమించిన అన్ని సంవత్సరాలలో, మా కుటుంబ సభ్యుల మీద అనేక ఆరోపణలు చేసినా, మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం.. ఇటువంటి వాటికి భయపడేది లేదు..

*భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు.. మేమంతా వారు చూపించిన బాటలోనే నడుస్తాం

*భయపడేది లేదు… బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.. దీన్ని ప్రజలంతా గమనించాలి

Related Posts

You cannot copy content of this page