SAKSHITHA NEWS

మతోన్మాదులను ఓడగొట్టడమే భగత్ సింగ్ కు మనమిచ్చే ఘనమైన నివాళి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి సందర్భంగా నేడు జగత్గిరిగుట్ట,భగత్ సింగ్ మర్గ్లో,లెనిన్ నగర్లో వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఏసురత్నం, ఏ ఐ వై ఎఫ్ కార్యదర్శి వెంకటేష్ తో కలిసి పూలమాలలు వేసి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 93 సంవత్సరాల క్రితమే మతం మనుషుల మధ్య విభేదాలను సృష్టిస్తుందని, ఒక ప్రాంతం మరో ప్రాంతం పై,ఒక కులం మరో కులం పై ,ఒక మతం మరో మతం పై,ఒక వ్యక్తి మరో వ్యక్తి పై దాడి చెయ్యనటువంటి సమసమాజ నిర్మాణం సోషలిస్టు వ్యవస్థతోనే సాధ్యమని చెప్పి,సమాజంలో అసమానతలను పెట్టుబడిదారీ వర్గ సృష్టేనని,అసమానతలు లేని సమాజం సృష్టించాలని ఆనాడే ప్రజలకు పిలుపునిచ్చారు. తన ఉరిశిక్ష రద్దు చేసుకునే వీలు ఉన్నప్పటికీ, క్షమాభిక్ష అడగటం సిగ్గుచేటని తన తండ్రితో చెప్పి భారత దేశ మాతృమూర్తి కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు భగత్ సింగ్ అని అలాంటి వారి ఆశయాలను పక్కనపెట్టి క్షమాభిక్ష అడిగి బయటకు వచ్చిన సావర్కర్ ను వీర్ అంటూ నేటి బీజేపీ పాలకులు వారి వర్ధంతి జన్మదినాలు చెయ్యడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలకు నిజమైన దేశభక్తులు ఎవరో తెలుసునని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం భగత్ సింగ్ గారి చరిత్రను తొలగించడం అంటే అసలైన ఉద్యమకారుల త్యాగాలను చేరిపీ పిరుకి వారి త్యాగాలను ప్రజలకు చెప్పడమేనని కావున మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం చరిత్రను తిరగరాస్తారని అలా జరగకుండా ఉండాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాల్సిందేనని అన్నారు. తెలంగాణ చరిత్రను కూడా రజాకర్ సినిమా పేరుతో అసలైన పోరాటాన్ని పక్కనపెట్టి ముస్లిం హిందు ఘర్షణలుగా చిత్రీకరించి తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరించడం బీజేపీ విధానాల్లో భాగమేనని ఎద్దేవాచేశారు. మతాల పేరుతో ప్రజల మధ్య మత విద్వేషం సృష్టించేవారే ప్రజల అసలు శత్రువుని వారితో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు టీలుకోవలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కోశాధికారి సదానంద, ఏఐటీయూసీ అధ్యక్ష,కార్యదర్శి హరినాథ్, శ్రీనివాస్,మునిసిపల్ అధ్యక్షుడు రాములు,కార్యవర్గ సభ్యులు సహదేవరెడ్డి, యువజన నాయకులు బాబు, సీపీఐ నాయకులు సామెల్, రవి,సాయిలు,యాదగిరి, ప్రభాకర్,ఇమామ్,ఆశయ్య, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 23 at 4.45.17 PM

SAKSHITHA NEWS