SAKSHITHA NEWS

జాజిరెడ్డిగూడెం గ్రామంలోని అర్హులైన అందరికీ దళిత బందు, బీసీ బందు, గృహలక్ష్మి పథకం అమలు చేయాలని శాంతియుతంగా అంబేద్కర్ విగ్రహం నుండి గ్రామపంచాయతీ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేసిన కాంగ్రెస్, CPI ML న్యూడెమోక్రసి, CPM, బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ తరలించడం జరిగింది. గ్రామంలో అర్హులైనటువంటి వారికి సంక్షేమ పథకాలు అందించకుండా బీఆర్ఎస్ నాయకులకు అందించడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్నపర్తి జ్ఞాన సుందర్,CPI ML న్యూడెమోక్రసి డివిజన్ నాయకులు పోలేబోయిన కిరణ్ లు మాటలాడత్తు అన్నారు. తక్షణమే జాజిరెడ్డిగూడెం గ్రామం లో పరిశీలన చేసి అర్హులైనవారి అందరికీ దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మీ పథకాలను కేటాయించాలి.

6 నెలలు క్రితం యాదవ లు గొర్రెల డిడి లు కట్టిన నేటికి గొర్రెలు పంపిణి చేయకపోవడం అంటే యాదవ కుటుంబాల జీవితాలతో ఆడుకోవడమే అని అన్నారు. వడగండ్ల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆరు నెలలు గడుస్తా ఉన్నా నేటికీ ఆదుకుపోవడం అంటే రైతుల పట్ల ఎంత చింత శుద్ధి ఉందో అర్థం అవుతుందని అన్నారు. ఈ ధర్నాకు మద్దతుగా CPM జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గం ఇంచార్జి కడియం రామచంద్రయ్యలు మద్దతు తెలిపి రానున్న ఎన్నికల్లో సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ నాయకులకు కేటాయిస్తున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ని గద్దదించాలని అన్నారు.

ఈ నీరసన కార్యక్రమంలో జాజి రెడ్డి గూడెం ఎంపీటీసీ నర్సింగ నాగమ్మ శ్రీనివాస్, దాసరి సోమయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు శిగ నసిర్, నోముల నరేష్, బింగి కృష్ణ, మాధగాని రమేష్, ఎల్లమ్మ కంటి యాదగిరి, మండల ప్రవీణ్, నర్సింగ కృష్ణమూర్తి,బింగి లింగమల్లు న్యూడెమోక్రసి గ్రామ కార్యదర్శి వడకల బయన్న, పోలేబోయిన మధుకర్, సునీత , CPM నాయకులు చెన్నబోయిన వీరయ్య, శిగ శ్రీకాంత్, వెంకన్న, శ్రీను, పి. రవి , బీజేపీ నాయకులు కీర్తి వెంకన్న, బింగి రమేష్, బట్టమేకల రాంమలు, లతో పాటు నాయకులు సూరు సైదులు, వల్లల కోటి, బాబు రావు, కుమార్ మేకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS