నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)
నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థీయేటర్ లో అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని అలాగే యుద్ధప్రాతిపదికన ఆపరేషన్ థియేటర్ మరమ్మతులు చేయాలని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ డిమాండ్ చేసారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో అగ్నిప్రమాదం జరిగి ఎసి, బిపి మెషిన్ మరియు ఆపరేషన్ పరికరాలు కాలిపోవటం జరిగింది. సంఘటనా స్థలాన్ని దైధ రవీందర్ సందర్శించారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ దాదాపు 2 లక్షల మంది ఉన్న నియోజకవర్గ ప్రజలందరికీ వైద్య సేవలు అందించాల్సిన నకిరేకల్ ఏరియా ఆస్పత్రిపై ఇంత నిర్లక్ష్యమా అని అన్నారు.
30 పడకల నుంచి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయి రెండు సంవత్సరాలు అవుతున్న నేటికి కనీస సౌకర్యాలు లేవని
ఆసుపత్రి అడ్వైజరి కమిటీ చైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ఒకసారి కూడా ఆసుపత్రిని సందర్శించి రివ్యూ చేయకపోవడం బాధాకరమన్నారు. ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో అగ్నిప్రమాదం జరిగి ఏసి మరియు ఆపరేషన్ పరికరాలు కాలిపోయి ఆపరేషన్ లు ఆగిపోయి రోగులు ఇబ్బందులు పడుతున్నారని యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ థియేటర్ ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ కేతేపల్లి మండల అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్
ఎండి యూసుఫ్ , దీకొండ ధనమ్మ , చెనగోని రాజశేఖర్ గౌడ్ , నర్సింగ్ మహేష్ , వంటెపాక సతీష్ , ధైద సురేష్ , చెరుపల్లి సైదులు , పశుపతి , పందిరి సతీష్ , నల్లగొండ మహేష్ , నల్లగొండ సాయి , పట్టేటి వెంకటేష్ మధు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.