నూతన ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని ప్రారంభించిన సైబరాబాద్ సీపీ

SAKSHITHA NEWS

సాక్షిత : గచ్చిబౌలి లోని మాదాపూర్ డిసిపి ఆఫీసులోని మూడవ అంతస్తులో నూతనంగా నిర్మించిన మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి కార్యాలయం మరియు అదనపు ట్రాఫిక్ డిసిపి కార్యాలయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు చేసిన డిసిపి, ఏడిసిపి కార్యాలయంలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు.


పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా నూతనంగా కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను నార్సింగి, మేడ్చల్, రాయదుర్గం అర్ సి పురం ఏర్పాటు చేశామన్నారు.
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రానున్న వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది పని చేయాలన్నారు.
అలాగే రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మాదాపూర్ మాదాపూర్ ట్రాఫిక్ ఏసిపి హనుమంతరావు రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ మరియు సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు.


సిపి వెంట ట్రాఫిక్ జాయింట్ సీపీ శ్రీ నారాయణ నాయక్ ఐపీఎస్., మాదాపూర్ లాం అండ్ ఆర్డర్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, ఏడీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసిపి హనుమంతరావు, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నవీన్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసయ్య, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page