పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగుర బోతోంది : కాట శ్రీనివాస్ గౌడ్
సాక్షిత : *పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం లోని సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు సంక్షేమాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డు పోస్టర్ ను ఆవిష్కరించిన *పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనేక రకాలుగా హింసించారన్నారు, ఎంఎంటీఎస్ రైలు విస్తరణలో భాగంగా గూడు కోల్పోయిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు, కాంగ్రెస్ హయాంలోనే బిహెచ్ఇఎల్, ఒడిఎఫ్, బిడిఎల్ వంటి పరిశ్రమలు వచ్చాయని బీఆర్ఎస్ హయాంలో ఏమి వచ్చాయని ప్రశ్నించారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ రుణమాఫీ కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, కేసీఆర్ హయాంలో ఒరగబెట్టిందేమి లేదన్నారు. రామచంద్రపురం పరిధిలో రెండు జిహెచ్ఎంసి డివిజన్లు ఉన్నప్పటికీ ఒక జిహెచ్ఎంసి కార్యాలయం కూడా లేదని, అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే రామచంద్రపురం లో జిహెచ్ఎంసి కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానన్నారు. నవంబర్ 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాట శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి పటాన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ప్రతి మహిళకు 2500 ఇస్తామని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణ మాఫీ చేస్తామని మరియు రేషన్ షాపులో 9 రకాల వస్తువులను అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల హామీలను గెలిచిన వంద రోజుల్లో అమలు చేసి తీరుతుందని అన్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు .
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, 111 డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, సంగారెడ్డి జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ హబీబ్ జానీ, సంగారెడ్డి జిల్లా INTUC ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు మావీన్ గౌడ్, సంగారెడ్డి జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షుడు యాదగిరి, సంగారెడ్డి జిల్లా కన్వినర్ వాజీద్, మండల్ ప్రెసిడెంట్ క్రిష్ణ, ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి, యాదగిరి, మున్సిపాలిటీ ప్రెసిడెంట్స్ సి ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, కౌన్సిలర్ ఎల్ రవీందర్, శాంతమ్మ, సారా శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్, నవీన్ గౌడ్, పీటర్, నరేష్ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, కావాలి నాగేష్, సామ్రాట్, నవీన్, పశ, హమీద్, తాహిర్, గిరి, హరీష్, అజర్, రాంచందర్ గౌడ్, హబీబ్, సంతోష్, జగన్, సంపత్, ఆనంద్,మహిపాల్ గౌడ్, మీరజ్, కాంగ్రెస్ పార్టీ నాయకలు, కార్యకర్తలు, కె ఎస్ జి యువసేన సభ్యులు