SAKSHITHA NEWS

కరీంనగర్ జిల్లా.
జమ్మికుంట.

దృవీకరణ కోసం పోటెత్తిన జనం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీ సి కులవృత్తులు, చేతి వృత్తులకు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం కోసం ఈ నెల 20వ తేదీ లోగా ధరకాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో అందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు జమ్మికుంట తసిల్డర్ కార్యాలయానికి పోటెత్తారు. కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కార్యాలయ సిబ్బంది సకాలంలో అందివ్వడం లేదని, ధృవీకరణ పత్రాల కోసం రోజు కార్యాలయం చుట్టు తిరుగుతున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. గడువు దగ్గర పడుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు అధికారులు వెళ్ళతున్నారని, అధికారులు అందుబాటులో లేకపోవడంతో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించడంలో ఆలస్యం జరుగుతుందని పలువురు నాయకులు అభిప్రాయ పడుతున్నారు. కలెక్టర్ స్పందించి సకాలంలో కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లబ్దిదారులకు అందించేలా చొరవ తీసుకోవాలని, 20వ తేదీ గడువును పొడిగించాలని పలువురు నాయకులు, ప్రజలు కోరుతున్నారు.


SAKSHITHA NEWS