అక్రమ రవాణా కట్టడికి సరిహద్దులలో ఆరు చెక్ పోస్ట్ లు
రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ వారిని రక్షించేందుకు శిక్షణ కార్యక్రమాలు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా వుండాలి
ఉత్తమ ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి రివార్డులు
నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :
నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్ తో పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన
నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… అక్రమ్ర రవాణాను నియంత్రించేందుకు
జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల ద్వారా కట్టడి చేయాలన్నారు. ఏసీపీలు తరచూ చెక్ పోస్ట్ లను సందర్శించి తనిఖీ చేయాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరస్తుల కదలికపై నిఘా ఉండాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం వాటిల్లకుండా విధిగా హోటల్స్, లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు అధికారులు క్షేత్రస్ధాయిలో కృషి చేయాలని అన్నారు. కూసుమంచి నుండి ఖమ్మం రూరల్ వరకు శ్రీశ్రీ సర్కిల్ నుండి తల్లాడ వరకు, తిరుమలాయపాలెం రోడ్డు , తల్లాడ నుండి సత్తుపల్లి వరకు ఇల్లందు రోడ్డు కామేపల్లి వరకు అయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా వున్న నేపథ్యంలో బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి రోడ్డు భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని ఫాస్ట్ ఎయిడ్ , సిపీఆర్ ద్వారా రక్షించేందుకు, అదేవిధంగా అత్యవసర, మెడికల్ సర్వీసులకు సమాచారం ఇచ్చేందుకు రహదారుల వెంటా వున్న పెట్రోల్ బంక్ లు, హోటల్స్ , దుకాణాలు, డాబాల యజమానులకు అందులో పనిచేస్తున్న కార్మికులకు ప్రధమిక చికిత్స, సిపీఆర్ పై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించటంతో పాటు ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా వుండాలని సూచించారు.
ఎన్నికలకు సంబంధించి పరిపాలనా పరమైన ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, క్షేత్రస్థాయిలో ఎంతమంది సిబ్బందిని విధుల్లో పెట్టాలి తదితర అంశాలపై పూర్తి స్పష్టత కలిగి ఉండాలని పెర్కొన్నారు. సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపులో స్పష్టతతో ఉండాలన్నారు. ఎన్నికల సంబంధిత పాత నేరాలు తదితర అంశాలపై పోలీస్ అధికారులకు అవగాహన వుండాలని అన్నారు. జిల్లాలో 163 కేంద్రాలలో జరగనున్న గ్రూప్ పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఫంక్షనల్ వర్టికల్ అమలలో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రివార్డులు అందజేశారు. సమావేశంలో ట్తైనీ ఏఎస్పీ అవినాష్ కుమార్, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ , అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు ప్రసన్న కుమార్, గణేష్ , భస్వారెడ్డి, రహెమాన్, రామనుజం, వెంకటస్వామి, వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.