సిపిఐ సిపిఎం పార్టీలు బలపరుస్తున్న తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

SAKSHITHA NEWS

CPI should win Theenmar Mallanna who is being strengthened by CPM parties

సిపిఐ సిపిఎం పార్టీలు బలపరుస్తున్న తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
విస్తృత ప్రచారంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

సిపిఐ సిపిఎం పార్టీలు బలపరుస్తున్న తీన్మార్ మల్లన్న ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. ఖమ్మం త్రీ టౌన్ లో సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచిన ఖమ్మం వరంగల్ నల్లగొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించాలని కోరుతూ ఖమ్మం మెయిన్ బ్రాంచ్ ఎస్బిఐ జూబ్లీ పుర బ్యాంకులో ఉద్యోగస్తులు అందర్నీ కలిసి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాదులు మాట్లాడుతూ ఈనెల 27వ తారీకున జరిగే ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ దేశంలో ఉన్న మతోన్మాద శక్తులని ఓడించాలని అనే నిర్ణయంతో కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నాము. అందుకని ప్రచారంలో భాగంగా ఈరోజు విస్తృత ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఈ దేశంలో బిజెపి గెలిస్తే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కులమాతాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు సృష్టించాలని చూస్తుంది బిజెపి బిజెపి వచ్చిన పది సంవత్సరాలు కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినాయి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వెనకబడిపోయింది. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ సంస్థలన్నీ అప్పజప్పటానికి రంగం సిద్ధం చేసుకుంది ఎల్ఐసి ని రైల్వే లను బిఎస్ఎన్ఎల్ ను విశాఖ ఉక్కును ఇంకా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ఆదానీ అంబానీల గ్రూపులకు అప్పజెప్పాలని చూస్తున్నది .

దేశంలో మణిపూర్ లో కులమతాల మధ్య చిచ్చుపెట్టి అనేకమంది చాలు కారణమైంది ఒక మహిళను మానభంగం చేసి వీధులలో నగ్నంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు నల్ల డబ్బును వెనక్కి తెప్పించి ప్రజల ఖాతాలలో ఒక్కొక్కళ్ళ ఖాతాలలో 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధపు వాగ్దానం నల్లధనాన్ని స్విస్ బ్యాంకులలో ఎవరి ఖాతాలో ఎంత ఉందో కూడా చెప్పడానికి భయపడ్డాడు నరేంద్ర మోడీ. ఈ 10 సంవత్సరాలు కాలంలో ఈ దేశం ఎన్నో మెట్లు వెనక్కి ప్రతి వస్తువు మీద తినే తిండి మీద తాగేపాల మీద తినే అన్న మీద తినే బియ్యం మీద జీఎస్టీ పేరుతో పన్నులు మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే ఏ ఎన్నికలలో అయినా ముందుకొస్తే ఈ దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుంది.అందుకని మేధావులు ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా బాగా ఆలోచించి బిజెపికి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని తీన్మార్ మల్లన్న గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, నందిపాటి మనోహర్, కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ ఖమ్మం నగరం అధ్యక్షులు జావీద్, ఎర్రం బాలగంగాధర్ తిలక్, రాష్ట్ర గిడ్డంగుల విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం టూ టౌన్ కార్యదర్శి సుదర్శన్, సిపిఎం ఖమ్మం 3 టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు వజేనేపల్లి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు బండారు యాకయ్య, 35వ డివిజన్ సిపిఎం కార్పొరేటర్ ఎల్లంపల్లి వెంకట్రావు, సిపిఎం త్రీ టౌన్ కార్యదర్శివర్గ సభ్యులుషేక్ సైదులు, షేక్ హిమామ్, శీలం వీరబాబు, పోతురాజు జార్జి, వీరభద్రం, షేక్ ఖాసిం, గుమ్మడి బిక్షం, డున్గ్రోతు శంకర్, మహిళా సంఘం నాయకురాలు బండారు సునీత, సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page