సీపీఐ షాపూర్ నగర్ కార్యాలయంలో నేడు ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయిలు గౌడ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకుల బుకబ్జాలకు అడ్డే లేకుండా పోయిందని జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసి అమాయక ప్రజలకు లక్షలాది రూపాయలకు అమ్మి మోసం చేస్తున్నారన్నారు. ఈ విషయం అంతా తెలిసి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం హస్యాస్పదమని స్వయంగా రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జరిచేసినప్పటికి స్థానిక అధికారులు పాటించకపోవడం దారుణమని ఇలాగే వదిలేస్తే కొద్దీ రోజుల్లో ప్రభుత్వ భూమి అంటూ కనిపించిందని కావున సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యక్షంగా పోరాడుతూ అవసరమైతే అధికారుల ఆదేశాలు పాటించేటట్లు చేయాలని కోర్టు కు వెల్లుతామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం భూకబ్జాదారులను చూసి చూడనట్లు వ్యవహరించడం తగదని ఇవేమీ రానున్న ఎన్నికల్లో ఓట్లు రాల్చవు అని అన్ని ప్రభుత్వ వ్యతిరేకతే అని తెలుసుకుంటే బాగుంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దశరథ్,స్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కృష్ణ, పి.శ్రీనివాస్ మండల నాయకులు వి.శ్రీనివాస్ పాల్గొన్నారు.