SAKSHITHA NEWS

ఐడీపీఎల్ కాలనీ పల్స్ హాస్పిటల్ ఎదురుగా గల నిర్మాణంలో ఉన్న భవనం పై అంతస్తులో రాడ్ స్క్రూ ఫిట్టింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఒర్రిసా కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శంకర్ అక్కడే మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నాయకత్వం పోలీసులు మృతదేహాన్ని హాస్పిటల్ తరలించకుండా ఆపి భవన నిర్మాణ ఇంచార్జ్ తో మాట్లాడి కార్మికుడి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ డబ్బులను పిల్లల పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఇవ్వాలని చెప్పడం జరిగింది.


భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు కార్మికులతో పని చేయించుకునే సమయంలో భవన నిర్మాణ గుర్తింపు కార్డ్, సేఫ్టీ పరికరాలు వాడుతున్నారా లేదా చూసుకోవాలని,అదే విధంగా నిర్మాణం చుట్టు సేఫ్టీ గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని కార్మికుల కుటుంబాల కోసం సీపీఐ, ఏఐటీయూసీ గా పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు స్వామి, రాష్ట్ర నాయకులు ఏసురత్నం,మాజీ కౌన్సిలర్ నర్సయ్య,సీపీఐ నాయకులు శ్రీనివాస్,సాయిలు, యాదన్న, యాకుబ్ లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS