కల్వకుర్తి లో ఘనంగా పులిజ్వాల పరుశురాముల ఆధ్వర్యంలో సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Spread the love

*CPI 98th Foundation Day Celebrations under the patronage of Pulijwala Parushuram in Kalvakurti

కల్వకుర్తి లో ఘనంగా పులిజ్వాల పరుశురాముల ఆధ్వర్యంలో సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సాక్షిత ప్రతినిధి


నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లోని మహబూబ్ నగర్ చౌరస్తా లో సోమవారం ఉదయం సిపిఐ 98వ ఆవిర్భవ దినోత్సవం సందర్బంగా సిపిఐ జెండా ను నియోజకవర్గ ఇంచార్జి పులిజాల పరశురాములు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎర్రజెండా స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించి పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించుకోవాలని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం లో ఎర్రజెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు గడ్డం శ్రీనివాసులు మూలమళ్ల రవీందర్ విష్ణు గోపాల్ బాస ప్రవీణ్ నిరంజన్ శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page