- చైర్ పర్సన్, కమిషనర్ తీరుపై అసహనం
-కౌన్సిలర్లతో బైఠాయించి కమిషనర్ డౌన్ డౌన్ అని నినాదాలు - సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు
నిధుల కేటాయింపుల్లో చైర్ పర్సన్, కమిషనర్లు కుమ్మక్కై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆక్షేపిస్తూ సర్వసభ్య సమావేశాన్ని బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. బొల్లారం మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే బి.ఆర్.ఎస్ పార్టీ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కౌన్సిలర్లు తమ వార్డులలో నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. - వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం పట్ల కౌన్సిలర్ చంద్రారెడ్డి ఇతర కౌన్సిలర్లతో కలిసి సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వార్డులను సమానంగా కేటాయింపులు చేయకపోవడంపై చైర్ పర్సన్, కమిషనర్లపై మండిపడ్డారు. సభ నుంచి వాకౌట్ చేసి కార్యాలయం ముందు బైఠాయించి కౌన్సిలర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పార్టీలో తగిన గుర్తింపు తోపాటు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపుతుండడంపై చంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన చైర్ పర్సన్, కమిషనర్ల తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లలో సంతోష , నిహారిక , గోపాలమ్మ , జయమ్మ , చంద్రయ్య , ఉన్నారు.
వార్డుల్లో నిధుల కేటాయింపులపై కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆగ్రహం
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…