ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Spread the love

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా బ్రాంచ్ వారు 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని తారకరామ్ నగర్ లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వైద్య శిబిరాన్ని సందర్శించి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బి.పి, షుగర్ వంటి అన్ని జనరల్ పరీక్షలు ఉచితంగా నిరవహిస్తు, ఉచితంగా మందులు కూడా అందిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య నిపుణులు అందిస్తున్న సలహాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో సమ్మద్, జగదీష్, ఖాజా, పోశెట్టిగౌడ్, కటికరవి, రమేష్ సాగర్, సంపత్, రెడ్ క్రాస్ సొసైటీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page