124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో పలుచోట్ల రోడ్డుపై నిలిచిన వరద నీరుని జిఎచ్ఎంసి సిబ్బందితో తొలగించడం జరిగింది. అలాగే భారీ వృక్షం ఒకటి నాలాలో కొట్టుకువచ్చి రాఘవేంద్ర నగర్ కాలనీలోని వంతెన వద్ద అడ్డుపడిందని సమాచారం అందుకున్న కార్పొరేటర్ వెంటనే జిఎచ్ఎంసీ సిబ్బందితో అక్కడకు వెళ్లి చెట్టును తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, వాసుదేవరావు, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాలలో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…