సాక్షిత : 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోనిలో ధరణి నగర్ లో డ్రైనేజ్ మరియు రోడ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని స్థానిక వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకుని రాగా కార్పొరేటర్ ధరణి నగర్ లో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలోని హైటెన్షన్ లైన్ రోడ్డులో డ్రైనేజ్ మరియు వాటర్ లైన్ సమస్యలు, కొన్ని గల్లీలలో సిసి రోడ్ పనులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అతి త్వరలో నిర్మాణ పనులు చేపట్టే విధంగా కృషి చేస్తానని కాలనీ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, కాలనీ అధ్యక్షులు రాజబాబు, భాస్కర్ రెడ్డి, పోశెట్టిగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ధరణి నగర్ లో పాదయాత్ర యాత్ర చేసి సమస్యలను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
Related Posts
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..
SAKSHITHA NEWS ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్..రింగ్స్ మార్చుకున్న పీవీ సింధు, వెంకటదత్తసాయి. 22న రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో సింధు పెళ్లి 24న హైదరాబాద్‌లో రిసెప్షన్. SAKSHITHA NEWS
రాహుల్ గాంధీ గారూ, ప్రేమను పంచడం అంటే ఇదేనా
SAKSHITHA NEWS రాహుల్ గాంధీ , ప్రేమను పంచడం అంటే ఇదేనా?: వీడియోను ట్వీట్ చేసిన కేటీఆర్ హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ నిలదీత మహిళలు ఇంట్లో ఉండగానే ఇళ్లను కూల్చుతున్నారంటూ ఆగ్రహం మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితే అంగీకరిస్తారా? అని…