Corporator Ragam Nagender Yadav participated in Telangana National Unity Vajrotsava celebrations
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *
*
సాక్షిత: శేరిలింగంపల్లి డివిజన్..* తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ఉత్సవాలను 16 సెప్టెంబర్ 2022 నుండి 18 సెప్టెంబర్ 2022 వరకు మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశానుసారం .
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , కార్పొరేటర్లు, విద్యార్థులు, మహిళలు, యువతి యువకులు, తెరాస నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని చందానగర్ పి.జె.ఆర్ స్టేడియం వరకు భారీ ఎత్తున ర్యాలీగా వచ్చే క్రమంలో చందానగర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు
, అనంతరం సి.ఏం. కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తాసిల్దార్ వంశీ మోహన్ , జోనల్ కమిషనర్ శంకరయ్య
, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ , శేరీలింగంపల్లి డిసి వెంకన్న , చందానగర్ డిసి సుదాంష్ , డి.ఎం.హెచ్.ఓ డాక్టర్ సృజన , ఎం.ఈ.ఓ వెంకటయ్య , డీ.ఎస్.ఓ రాథోడ్ , ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీబాయి , సి.పి.డి.ఓ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి , సిఐ క్యాస్ట్రో రెడ్డి , కార్పొరేటర్లు, రాజకీయ ప్రముఖులు, పాత్రికేయ మిత్రులు, అన్ని శాఖల అధికారులు, అనధికారులు, విద్యార్థిని విద్యార్థులు, యువకులు, మహిళలు, తెరాస నాయకులు, శ్రేయోభిలాషులు శేరిలింగంపల్లి నియోజకవర్గ అన్ని డివిజన్ ల ప్రజలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.