SAKSHITHA NEWS

సమస్యల పరిశీలన…

పటాన్చెరు డివిజన్ లోని గొల్ల బస్తి లో గతంలో నూతన సిసి రోడ్డు వేసే క్రమంలో మ్యాన్ హోల్స్ లోపల కాంక్రీట్ పడి ముద్దలు మారి డ్రైనేజీ లన్ బ్లాక్ అవ్వడం జరిగింది. దీనితో స్థానిక ప్రజలు డ్రైనేజీ బ్లాక్ వల్ల మురుగు నీరు పైకి రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఈరోజు HMWS AE ప్రవీణ్ కుమార్ తో కలిసి గొల్ల బస్తి కాలనీలోని మ్యాన్ హోల్స్ లను పరిశీలించారు. వెంటనే సమస్యకు పరిష్కారం చేయాలని కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్ ని కోరడం జరిగింది.అనంతరం నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను పరిశీలించారు వర్షపు నీరు పోయేలా స్లోపింగ్ సరైన పద్ధతిలో చేయాలని నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మించాలని కార్పొరేటర్ సూచించారు.

నిన్న కురిసిన వర్షానికి కాలనీలలో డ్రైనేజ్ లైన్ జామ్ అయి మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుందనీ
నందన్ రతన్ ప్రైడ్ కాలనీ వాసులు మరియు చుట్టు పక్కల కాలనీ వాసులు కార్పొరేటర్ కి తెలియజేయగా కార్పొరేటర్ వెంటనే స్పందించి నందన రతన్ ప్రైడ్ కాలనీలో ప్రవీణ్ తో కలిసి పరిశీలించి వెంటనే సమస్య తీరెలలా చూడాలని కోరారు.

రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు వచ్చే నెల జూలై 1వ తేదీన హర్యానా వెళ్తున్న GHMC ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే శ్రీనివాస్ కుమారుడు B.హనుమంత్ కుమార్ ను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అభినందించడం జరిగింది.
రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో తప్పక విజేతగా నిలిచి తల్లి దండ్రులకు అలాగే మన మన పటాన్చెరుకు గొప్ప పేరు తీసుకురావాలని కోరారు.

పోటీల్లో పాల్గొనడానికి వెళ్తున్న హనుమంత్ కుమార్ ప్రయాణ కర్చులకు తాను సహాయం చేస్తానని కార్పొరేటర్ హామీ ఇవ్వడం జరిగింది.


SAKSHITHA NEWS