నగరి మున్సిపాలిటీ పరిధిలోని బీమా నగర్ నందు డ్రైనేజీ కాలువలు నిర్మించి మరియు సిమెంట్ రోడ్లు వేయండి
డ్రైనేజీ మురుగు నీరు వలన వచ్చే డెంగ్యూ మలేరియా వ్యాధుల నుంచి పిల్లలను వృద్ధులను కాపాడండి
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో నగరి మున్సిపల్ పరిధలో
నున్నటువంటి భీమా నగర్ ప్రజలు ఆవేదన
భీమా నగర్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్న ప్రజలకు సంఘీభావం ప్రకటించిన
సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య
నగరి మున్సిపాలిటీ లో ఉన్న భీమా నగర్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు మున్సిపల్ కార్యా లయం దగ్గర నిరసన భీమా నగర్ ప్రజలు నిరసన తెలియపరిచారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ సుమారు 120 కుటుంబాలు ఉన్నామని మాకు సరైన డ్రైనేజీ లేదని తాగునీటి లైన్ కూడా లేదని అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకువచ్చిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు, కనీసం సిమెంట్ రోడ్లు కూడా సక్రంగా లేవని కావున మాకు డ్రైనేజీ సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలి కోరుతూ మున్సిపల్ అధికారులకు విన్నవించారు.
ఈ సందర్భంగా వీళ్ళకి సంఘీభావం తెలుపున సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఏర్పడిన మొదలుకొని ఇప్పటికీ డ్రైనేజీ కాలువల్లేవని కౌన్సిలర్లు అధికారులు మారుతున్న వారి సమస్య పరిష్కారం కాలేదని వర్షపు నీరు వస్తే ఇప్పటికీ చెంబులతో వర్షపు నీటిని ముంచి పోసుకుంటున్నారు. అధికారులతో మాట్లాడితే 16 లక్షల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పుతున్నారు ,దానికి గ్రామస్థుల బాధ్యులు అని అడుగుతున్నాము, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు
అనంతరం నగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీయుతులు నీల మేఘం గారు ఆందోళన కార్లతో మాట్లాడుతూ రేపే దారికి మట్టి పోసి రోడ్డు బాగు చేస్తామని అదేవిధంగా డ్రైనేజీ ఏర డ్రైనేజీ ఏర్పాటుకు మన రాష్ట్ర మంత్రి గారితో మాట్లాడి డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారితో మాట్లాడి రేపే పనులు మొదలు పెట్టాలని వెంటనే రోడ్డు బాగు చేయాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భీమా నగర్ వార్డ్ ప్రజలకు సంఘీభావం ప్రకటించిన నగరి నియోజకవర్గంసీపీఐ పార్టీ కార్యదర్శి కోదండయ్య 12,13,వార్డు నాయకులు అర్జున రవి కుమార్ ధనుంజయ్ వేలు బాలకృష్ణ మాణిక్యం అమ్ములు ఉన్నాము ఉన్నామలై అలిమేలు నాగమ్మ ద్రాక్షయని ఏ ఐ టి యు సి నాయకులు సిరావుద్ధిన్ ప్రజలు పాల్గొన్నారు