లక్ష్మీపురం పంచాయతీలో ఇంటింటికి కుళాయిలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

Spread the love

లక్ష్మీపురం పంచాయతీలో ఇంటింటికి కుళాయిలను ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో నేతేరు గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులుతో 30.90లక్షలు అలాగే నేదురుపేట గ్రామంలో జలజీవన్ మిషన్ నిధులుతో 20.35లక్షలు వ్యయంతో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయిలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతులు మీదుగా లబ్ధిదారులకుపంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో లావేరు మండలం ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ,జడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజినాయుడు, లక్ష్మీపురం పంచాయతీ సర్పంచ్ కొల్లి యల్లమ్మ, ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లి ఈశ్వరరావు,దల్లి రాజారావు,చాట్ల రమణ,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ సచివాలయం సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page