స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉంది
ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే, తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యం
ఫిబ్రవరి 1, 2024 న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని పత్రికల సాక్షిగా ప్రచారం చేసిన కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటంతో నిర్వహిస్తుంది
- మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు