కాంగ్రెస్ పార్టీ మాదిగల ద్రోహి…

Spread the love

తెలంగాణలో 70 లక్షలకు పైగా జనాభా ఉన్న మాదిగలకు ఒక్క పార్లమెంట్ స్థానం కూడ యివ్వాని కాంగ్రెస్ పార్టీనీ ఓడిస్తాం….

పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరింగింది.

ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ.

శంకర్ పల్లి శంకర్ పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ శంకర్ పల్లి మండల అధ్యక్షులు బండ్లగూడెం శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ కార్యదర్శి బ్యాతల శివ శంకర్ మాదిగ ఎం ఎస్ ఎఫ్ నాని భాను ప్రసాద్ మాదిగ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. దళితుల్లో 20% గళ్ళ మాలలకు రెండు సీట్లు కేటాయించి, ఊరుకొక్కరు లేని బైండ్ల కులానికి ఒక సీటు ఇచ్చిన రేవంత్ రెడ్డి, దళితుల్లో 75% గల మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో మల్లు కుటుంబానికి, గడ్డం వివేక్ కుటుంబానికి ఉన్న విలువ మాదిగ జాతికి లేదని, అందుకు కేటాయించిన స్థానాలే సాక్ష్యమని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్థానికేతరుడై ఉన్నా, స్వయంగా డిప్యూటీ సీఎం సోదరుడైనా, తాను కేబినెట్ హోదాతో ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడి ఉన్నా కూడా మల్లు రవి కే అట్టి స్థానాన్ని కేటాయించడం, అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో రెండు నియోజకవర్గాల నుండి ఒకే కుటుంబం నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్ లు చెన్నూరు, బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నా ,మల్లి ఆ పార్లమెంట్ స్థానాన్ని వారి కుటుంబానికే ఇప్పించుకోవడం, వరంగల్ లో మాదిగలను రాజకీయంగా అడుగడుగునా అనిచివేసిన రాజకీయ అవకాశవాధి, ఊరికి ఒక్కరు లేని బైండ్ల కులానికి చెందిన శ్రీహరి గారికి ఇవ్వడం చూస్తుంటే అది అర్ధం అవుతుందని గుర్తుచేశారు.

తెలంగాణ లో నాలుగు శాతం జనాభా కలిగిన తమ రెడ్డి కులానికి ఆరు సీట్లను కేటాయించుకున్న రేవంత్ రెడ్డి, 12 శాతం జనాభా గల మాదిగలకు స్థానమే లేకుండా చేయడం, 50% జనాభా కలిగిన బీసీలకు 2 స్థానాలే కేటాయించి ద్రోహం చేశాడని, కాంగ్రెస్ ముమ్మాటికీ ప్రజా ప్రభుత్వం కాదు, రెడ్ల, మాలల ప్రభుత్వమేనని అన్నారు. మాదిగలకు ద్రోహం చేసిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని ఇదే ధోరణిని అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎం పి స్థానాల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి వైఖరికి నిరసనగా పది రోజుల పాటు నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు చన్నగల్ల నర్సింలు మాదిగ, ఎం ఎస్ ఎఫ్ శంకర్ పల్లి మండల కన్వీనర్ డప్పు శ్రీకాంత్ మాదిగ కో కన్వీనర్ మనోజ్ మాదిగ మొయినాబాద్ మండల కన్వీనర్ కొండిగారి మహేందర్ మాదిగ కో కన్వీనర్ రాజు మాదిగ, చేవెళ్ల మండల అధ్యక్షులు ఊరెంట ప్రవీణ్ కుమార్ మాదిగ, ఉపాధ్యక్షులు చేవెళ్ల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page