హైదరాబాద్: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢిల్లీలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ రికార్డులు మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు. సీఈవోను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ, ఉత్తమ్, పొంగులేటి ఉన్నారు..
సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…