హైదరాబాద్:-బుధవారం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించి, ఆమె మాట్లాడారు….కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటేనన్న డీకే అరుణ ఆరోపించారు.ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలిని డిమాండ్ చేశారు.ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతుంది అని అన్నారు.మూడు పార్టీలు ఒక్కటేనని స్పీకర్ ఎన్నిక స్పష్టం చేస్తోంది అని అన్నారు.రైతుబంధును వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలి అని అన్నారు.రూ. 500 గ్యాస్ కోసం ఎజన్సీల ముందుకు మహిళలు క్యూ కడ్తున్నారు..బీజేపీ పోరాటం వలనే కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
ఉచిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది…ఎవరు ఎవరితో కుమక్కు అయ్యారో తాజా పరిణామాలే ఉదాహరణ అని అన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు శాతం, సీట్లను గణనీయంగా పెంచుకుంది..రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలవబోతోంది.మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో మట్టి కరింపించారు.తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి.అర్థిక భారాన్ని సాకుగా చూపి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ఎగనాం పెట్టకూడదు.ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే,వరసగా మూడోసారి నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కాబోతున్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 403స్థానాలను గెలవబోతోంది..ప్రధాని మోదీ పాలనపై చిల్లర మాటలు మాట్లాడిన వారికి మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు,రాహుల్ గాంధీ సన్మిహిత ఎంపీ సాహూ ఇంట్లో వందల కోట్లు దొరకటం సిగ్గుచేటు,అవినీతి సామ్రాట్ లు నరేంద్రమోదీని గద్దె దించాలని చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావు..మోదీ హాయాంలో అభివృద్ధిలో భారతదేశం దేశం దూసుకుపోతోంది అని అన్నారు….