టమాటా రైతు కు అభినందన

Spread the love

హైదరాబాద్:-టమాట పండించి కోటీశ్వరుడైన కౌడిపల్లి రైతు మహిపాల్ రెడ్డి దంపతులని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి సెక్రటేరియట్‌లో ముఖ్య మంత్రిని మహిపాల్ రెడ్డి దంపతులు కలిశారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాట పంటను అమ్ముకోగా ,మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని సీఎంకు వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని మహిపాల్ రెడ్డికి కేసీఆర్ సూచించారు.

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి అనే రైతు టమాట పండించి కోటీశ్వరుడయ్యారు. తనకున్న పొలంతోపాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని మహిపాల్‌రెడ్డి కూరగాయలు సాగు చేస్తుంటారు. ఈసారి ఎనిమిది ఎకరాల్లో టమాట పంట వేశారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి టమాటాకు మునుపెన్నడూ లేని ధర పలుకుతుండటంతో మహిపాల్‌ రెడ్డిని లక్ష్మీదేవి కరుణించింది. ఇప్పటిదాకా ఎనిమిది వేల బాక్సుల ఒక్కో బాక్సు 25 కిలోలు టమాటాలు విక్రయించగా మహిపాల్‌రెడ్డికి రూ.కోటీ 84 లక్షలు వచ్చాయి. ఇంకా రూ.కోటి విలువ చేసే టమాట ఆయన వద్ద ఉంది. అయితే, వచ్చిన ఆదాయంలో రూ.50లక్షల వరకు పెట్టుబడి ఖర్చులకు వెళ్తుందని మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు మహిపాల్‌రెడ్డి 550 టమాట బాక్సులు తీసుకెళ్లగా ఒక్కో బాక్సు రూ.2,300 నుంచి రూ.2,500 చొప్పున పలికింది. దీంతో ఒక్కరోజే మహిపాల్‌రెడ్డికి రూ.13.75లక్షలు వచ్చాయి…

Related Posts

You cannot copy content of this page