తిరుపతి ఖ్యాతిని పెంచినందుకు అభినందనలు

Spread the love
తిరుపతి ఖ్యాతిని పెంచినందుకు అభినందనలు - ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి



స్వచ్చ సర్వేక్షన్ 2022లో తిరుపతి నగర ఖ్యాతిని పెంచినందుకు అభినందనలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రసంసలు తెలియజేసినట్లు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.  ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని మునిసిపల్ మంత్రి ఆదిమూలం సురేష్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీ, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి కలిసిన అనంతరం ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని 3700 నగరాల్లో ఒకటి నుండి పది లక్షల జనాభా కల్గిన అత్యంత పరిశుభత్ర నగరాల్లో తిరుపతి నగరం మొదటి స్థానంలో నిలిచి ప్రెసిడెన్షియల్ అవార్డును సపాయిమిత్ర సురక్ష సెహార్ గా తిరుపతి ఎంపిక కాబడ్డంతో ఈ నెల ఒకటవ తేదిన న్యూడిల్లిలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించడం జరిగిందని తెలియజేసారు. తిరుపతి నగరపాలక సంస్థకు ఈ అవార్డు రావడానికి కృషి చేసిన వారందరికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేసారని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరోసారి ఈ అవార్డును స్వీకరించడం వలన తమపై మరింత భాధ్యత పెరిగిందని, భవిషత్తులో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ది వైపు తీసుకెల్లెందుకు అన్ని విధాల కృషి చేస్తామని వారు తెలియజేసారు. ఈ అవార్డ్ రావడానికి కృషి చేసిన తిరుపతి ప్రజలకు, నగరపాలక సంస్థ సిబ్బందికి, కార్మీకులకు ఈ సందర్భంగ మరోసారి ఎమ్మెల్యే భూమన, మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి కృతజ్ఞతలు తెలియజేసారు.

Related Posts

You cannot copy content of this page