జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి శంఖుస్థాపన

SAKSHITHA NEWS

జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి శంఖుస్థాపన

రూ.50 లక్షల నిధులు మంజూరు చేసిన జడ్పీ చైర్ పర్సన్

జగిత్యాల :

జగిత్యాల జిల్లా తిప్పన్నపేట్ గ్రామ శివారులో నిర్మించనున్న జిల్లా మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత – సురేష్ ఆదివారం శంఖు స్థాపన చేశారు. జిల్లా అధ్యక్షులు ఓడ్నాల రాజ శేఖర్ అధ్యక్షతన ఈ శంఖు స్థాపన కార్యక్రమం నిర్వహించారు.
జడ్పీ నుండి డిఎంఎఫ్.టి నిధుల ద్వారా రూ.50 లక్షలు జిల్లా మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి కేటాయించడం పట్ల జిల్లా మున్నూరు కాపులు అంతా జడ్పీ చైర్ పర్సన్ ను ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత – సురేష్ మాట్లాడుతూ ఒక రైతు బిడ్డగా, ఒక మున్నూరు కాపు కులస్తురాలుగా నేను మన కుల సంఘం బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయాల కతీతంగా నన్ను జగిత్యాల నుండి జడ్పీటిసి గా గెలిపించి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా నియమించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను అని పేర్కొన్నారు. జిల్లా అధిక జనాభా కలిగి ఉన్న మనకు వచ్చిన అవకాశంతో జిల్లా వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా సేవలు అందించామని తెలిపారు. జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు కలిసి కట్టుగా అందరం కృషి చేద్దామని ఆమె పిలుపు నిచ్చారు. సభాధ్యక్షులైన జిల్లా అధ్యక్షులు ఒడ్నాల రాజ శేఖర్ మాట్లాడుతూ కుల సంఘం ఏర్పాటుకు, కళ్యాణ మండపం, భవన నిర్మాణం లకు కులాల కతీతంగా కూడా ఆర్థిక సహాయం అందజేసిన వారి వివరాలు ప్రకటించారు. వారందరికీ జిల్లా సంఘం పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కులస్తులంతా సహకరిస్తే మరింత కులాభివృద్ధికి, సంఘాల బలోపేతానికి గ్రామాల వారీగా, మండలాల వారీగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్ రమణ, దావ సురేష్, రాచకొండ శ్రీరాములు, గోవిందుల రాజన్న, హరి అశోక్ కుమార్, పుప్పాల అశోక్, సౌల్ల భీమన్న. సంఘి శేఖర్, సంగి నర్సయ్య, చుక్క గంగారెడ్డి, పడాల జలపతి, రాజిరెడ్డి, బండారి విజయ్, కొలగాని మధు సుదన్, వజ్రక్క, చీటి లక్ష్మి నారాయణ, అయ్యేరీ సుధాకర్, లైషెట్టి నారాయణ, దావా శేఖర్, అత్తినేని గంగారెడ్డి, లైశెట్ట్ వెంకట్, జంగిలి చంద్రమౌళి, పల్లికొండ మహేష్, తేలు రాజు, నత్తి రాజ్ కుమార్, కోల శ్రీనివాస్, గాండ్ల స్వామి, ఆరే మల్లేష్, పోచంపేట్ నరేష్, చిట్ల అంజన్న, మహిపాల్ తదితరులతో పాటు జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన మున్నూరు కాపులు హాజరయ్యారు.

WhatsApp Image 2024 06 23 at 22.07.27

SAKSHITHA NEWS

Related Posts

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSPONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన* ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు…


SAKSHITHA NEWS

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSFESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు సాక్షిత సిద్దిపేట జిల్లా :మర్కుక్ మండలం భవనందాపూర్ గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమంలో 93వ ఆషాడ ఉత్సవాలు ఈనెల 16, 17,18 వ తేదీలలో జరగనున్నాయి.ఈ ఉత్సవాలని ఆశ్రమ పెద్దలు గురువులు…


SAKSHITHA NEWS

You Missed

PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 21 views
PONGULETI పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన*

FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 37 views
FESTIVALS మొదలైన ఆషాడ పాండురంగ స్వామి ఉత్సవాలు

BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 32 views
BJP బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 26 views
GHAZWAL గజ్వేల్ లో నవోదయ మోడల్ పరీక్ష

BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 22 views
BATON CHARGE శాంతియిత నిరసనపై లాఠీఛార్జ్ తగదు

GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

 • By sakshitha
 • జూలై 13, 2024
 • 23 views
GOD భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు

You cannot copy content of this page