గుండే పోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సంతాపం తెలియజేసిన ఆలంపూర్ సీఐ రాజు
జిల్లా లోని ఇటిక్యాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో గుండే పోటు తో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఏం.ప్రసాద్ కుటుంబానికి వారి స్వగ్రామం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామం లోని వారి స్వగృహం నందు జిల్లా ఎస్పీ శ్రీమతి రితి రాజ్ IPS, అదనపు ఎస్పీ ఎన్.రవి ఆదేశాల మేరకు ఆలంపూర్ సి.ఐ రాజు నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలియజేసినారు. వారి చేతుల మీదుగా అంత్యక్రియ ఖర్చులకు గాను 20,000/- రూపాయలను అందజేశారు.
హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను సి . ఐ ఓదారుస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేసినారు.పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు.పోలీస్ శాఖలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇటిక్యాల , ఇతర జిల్లాల పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.