కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు.శేరిలింగంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ నందు ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్లిష్ట పరిస్థితులలో విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాయనన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని భావించామని స్వరాష్ట్రంలోని తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
మా కుటుంబాలను పక్కన పెట్టి విధులు నిర్వర్తించాము. కానీ మీరు పట్టించుకోవడం లేదు. చాలీచాలని జీతాలకు డ్యూటీ చేస్తూన్నాము. ఆయనను ఏ విధంగా మాకు గుర్తింపు లేదు. ఇది చాలా అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.