భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో సిపిఐ కార్యాలయం సయ్యద్ మియా జానీ భవన్లో మండల కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న సిపిఐ జిల్లా కార్యదర్శి ” కామ్రేడ్ సాబీర్ ” పాషా
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, తునికాకు సీజన్ మల్లి స్టార్ట్ అవుతుందని 2016 నుండి 2021 వరకు తునికాకు బోనస్ రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో విడుదల కాలేదు అలాగే రాష్ట్రంలో అన్ని సెంటర్లలో తునికాకు బోనస్ ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 100 కోట్ల రూపాయలు విడుదల కావలసి ఉందని ఆయన తెలిపారు ఈ 100 కోట్ల రూపాయలు తక్షణమే హరిజన ఇతర కులాల వారు సేకరించిన తుని కాకు బోనస్ చెల్లించాలని అటవీ శాఖ మంత్రి గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని అటవీశాఖ ఉన్నతాధికారులను భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఆయన అన్నారు ఈ బోనసులు తక్షణమే విడుదల చేయకుంటే జిల్లా వ్యాప్తంగా తునికాకు సేకరించిన వారిని సమీకరించి ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఆందోళనలు జరగకుండా ఉండాలంటే వెంటనే జిల్లాకు సంబంధించిన తుని కాకు బోనస్ 100 కోట్లు విడుదల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కార్యదర్శి కామ్రేడ్ సయ్యద్ సలీం మండల కార్యదర్శి జి రామకృష్ణ మండల సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ సంఘం కృష్ణమూర్తి ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులు టి సత్యనారాయణ నాగేంద్రబాబు మహిళా మండలి నుంచి చీపుర్ల సత్యవతి షేక్ దిల్షాద్ షేక్ రిజ్వానా మరియు మండల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.