సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో సంరక్షకులతో నివసించే అనాథల సర్వే మరియు గృహలక్ష్మి పథకం యొక్క వివరాల పై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియని ,
దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు,కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,
ముఖ్యమంత్రి కేసిఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావీజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,దరఖాస్తుదారులు
తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కి ధరఖాస్తులు పంపించవచ్చని, ఇది నిరంతర ప్రక్రియని,ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని,దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయలక్ష్మి సుబ్బారావు,చిట్ల దివాకర్,సురేష్ రెడ్డి,గాజుల సుజాత,కాసాని సుధాకర్ ముదిరాజ్,బాలాజీ నాయక్, G.శ్రీనివాస్ యాదవ్,స్వతంత్ర కార్పొరేటర్ వెంకటరామయ్య,సీనియర్ రవికాంత్,చంద్రగిరి సతీష్,NMC అధికారులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.