SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణలో చేపట్టిన పనులను ఇచ్చిన సమయానికి కల్లా పూర్తి చేయించాల్సిన భాధ్యత అధికారులపై వున్నదని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమిక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్ హరిత అధికారులనుద్దెశించి మాట్లాడుతూ అనుమతులు తీసుకొని ఇప్పటికే పనులు జరుగుతున్నవి, అదేవిధంగా అనుమతులు తీసుకొని పనులు ప్రారంభించి కూడా పూర్తి చేయకుండా పెండింగులో వున్న పనులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పనులు జరగకుండా జాప్యం చేస్తే కాంట్రాక్ట్ ను రద్దు చేయాల్సి వస్తుందనే విషయాన్ని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయించాలన్నారు. వేసవికాలంలో నీటి సదుపాయానికి అంతరాయం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరమ్మత్తులకు వచ్చిన బోర్లను వేగవంతంగా మరమ్మతులు చేసి సిద్దం చేయించాలన్నారు.

రోజు మార్చి రోజు నీటి సరఫరా విషయాన్ని ప్రస్థావిస్తూ స్లమ్ ఏరియాల్లో నీటి యద్దడి రాకుండా మునిసిపల్ ట్యాంకర్ల ద్వారా అవసరమైన ఏరియాలకు నీటిని సరఫరా చేయించాలన్నారు. చలివేంధ్రాల గురించి కమిషనర్ మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమయినందున తిరుపతి నగరంలోని ప్రధాన కూడల్లలో అదేవిధంగా ప్రజలు, కార్మికులకు అవసరమైన ప్రదేశాల్లో చలివేంధ్రాలను ఏర్పాటు చేయించాలన్నారు. అనుమతులు తీసుకొని కూడా ప్రారంభించని పబ్లిక్ టాయిలెట్లను వెంటనే నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోర్ట్ కేసుల్లో అప్రమత్తంగా వుండాలని, కోర్ట్ కేసుల్లో కౌంటర్ వేయడం, స్టే వున్న కేసుల్లో వెకెట్ చేయించేందుకు అలసత్వం వహించకుండా చూడాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత స్పష్టం చేసారు. ఈ సమిక్షా సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, గోమతి, నరేంధ్ర, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS