సాక్షిత : తిరుపతి శ్రీనివాస సేతు ప్రాజెక్టు రైల్వే వంతెనపై జరుగుతున్న నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలిస్తూ డెక్ స్లాబ్ పనులను చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ఆగస్ట్ మొదటి వారంలోపు శ్రీనివాస సేతు పనులు మొత్తం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పైన ఇప్పటికే మొత్తం ఆరు గెడ్డెర్లను అమర్చే ప్రకియ పూర్తి అయ్యిందని, గెడ్డెర్లపై డెక్ స్లాబ్ వేసిన అనంతరం దానిపై రోడ్డు వేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆర్వోబిపై రెండు వైపులా వున్న స్పాన్స్ పై సెగ్మెంట్స్ ఏర్పాటు చేసే ప్రకియ జరుగుతున్నదన్నారు. అధికారులకు సూచనలు చేస్తూ శ్రీనివాససేతు తుది దశ పనులను నిత్యం పర్యవేక్షణ చేస్తుండాలని, పనులను వేగవంతం చేసి ఆగష్టు మొదటి వారంలోపు పనులు పూర్తి అయ్యేటట్లు చూడాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఆఫ్కాన్ ప్రతినిధి స్వామి, ఏయికామ్ ప్రతినిధి భాలాజీ తదితరులు ఉన్నారు.*
శ్రీనివాస సేతుపై డెక్ స్లాబ్ పనులు చేపట్టండి – కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…