సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గృహాలు, వాణిజ్య సముదాయల్లో పన్నుల వ్యత్ససాలను సరిదిద్దెందుకు తగు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో రెవెన్యూ, ప్లానింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన కమిషనర్ హరిత మాట్లాడుతూ నగరంలో పన్నులు చెల్లిస్తున్న ప్రతి ఒక్క ఇళ్ళు, అదేవిధంగా వాణిజ్య సముదాయాలు పన్నులు కరెక్ట్ గా చెల్లింపులు జరుపుతున్నారా, వారికి విధిస్తున్న పన్నులు కరెక్ట్ విలువ ప్రకారమే విధించడం జరిగిందా అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. జగనన్న భూ హక్కు రిసర్వే పనులను కూడా పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా మన కార్పొరేషన్ నుండి రెసిడెన్షియల్ క్రింద పన్నులు చెల్లిస్తూ, ఎవరైన కమర్షియల్ క్రింద నడుపుకుంటుంటె, అలాంటి వాటిపై సర్వే నిర్వహించి, పన్నులు సవరించాలని, పన్ను బకాయిలపై నిరంతరం పర్యవేక్షిస్తూ, పన్నుల వసూళ్ళకు కృషి చేయాలని రెవెన్యూ అధికారులకు కమిషనర్ హరిత ఐఏఎస్ తగు సూచనలు జారీ చేయడం జరిగింది. ప్లానింగ్ అధికారులకు సూచనలు చేస్తూ నగరంలో ఆక్రమాణలను ఉపేక్షించవద్దని, అనధికార హోర్డింగులు, ప్లెక్సిలను తొలగించాలన్నారు. ఈ సమిక్షా సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, ఆర్.ఐలు పాల్గొన్నారు.
పన్నుల వ్యత్యాసాల్లో తేడాలు సరిదిద్దండి – కమిషనర్ హరిత ఐఏఎస్
Related Posts
ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా..
SAKSHITHA NEWS ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా.. ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి…( సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి…కేంద్రం బడ్జెట్ లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి.ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యోగుల…
బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది
SAKSHITHA NEWS జగ్గారెడ్డి బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. విలువలతో కూడిన రాజకీయం కేంద్ర బీజేపీ చేయకపోవడం దురదృష్టకరం . భారత్ మాతా కీ జై అని నినాదాలు చేసే బీజేపీ నేతలు… ప్రియాంక గాంధీ నీ కించపరిచే విధంగా మాట్లాడిన…