SAKSHITHA NEWS

జీ పాళెం జగనన్న ఇళ్ళను పరిశీలించిన కమిషనర్ అనుపమ అంజలి

*సాక్షిత తిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. జీ పాళెం లే అవుట్ లోని ఇంటి నిర్మాణాలను బుధవారం అధికారులతో కలిసి పరిశీలిస్తూ వేగవంతంగా పనులను చేపట్టి సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయాలని కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి అర్భన్ నివాసితులకు జీ పాళెంలో కేటాయించిన ఇంటి స్థలాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.

కొన్ని నిర్మాణాలు బేస్ మెంట్ పూర్తి చేసుకోవడం, మరికొన్ని గోడలు పూర్తి చేసుకోవడం, మిగిలినవి స్లాబ్ లెవల్లో పనులు పూర్తి అయ్యాయని, మరికొన్ని గృహ ప్రవేశాలకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. లే అవుట్లో ఇంటి నిర్మాణ పనుల్లో ఇబ్బంది రాకుండ ఇన్నర్ రోడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్ కొరత లేకుండా హౌసింగ్ అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు కమిషనర్ అనుపమ తెలిపారు. నిర్మాణాలకు నీటి కొరత లేకుండా అవసరమైతే మరిన్ని బోర్లు వేసుకోవాలని సూచనలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, హౌసింగ్ డిఈ బాలాజీ, అమ్నెటి సెక్రట్రీలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS