Command Control Center with state of the art technology
అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానంతో కమాండ్ కంట్రోల్ సెంటర్
*కమిషనర్ అనుపమ అంజలి
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని స్మార్ట్ సిటీ ఎం.డి, నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నగరంలోని ప్రధాన వీధులు, కూడళ్లను సీసీ కెమెరాలకు అనుసంధానం చేస్తారన్నారు. తద్వారా నగరంలో భద్రత మరింత పెరుగుతుందన్నారు.
నగరంలో ఏ మూల ఏమి జరిగినా క్షణాల్లో తెలిసే విధంగా సెంటర్ పనిచేస్తుందన్నారు. అలాగే వాహనాల రాకపోకల నియంత్రణ, నగరంలో పొల్యూషన్ నియంత్రణ, యూజర్ చార్జీల వసూళ్లు, అపరాధ రుసుము విధింపు వంటి కార్యక్రమాలు ఈ సెంటర్ ద్వారా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, ఈ. ఈ. చంద్రశేఖర్, ఏ ఈ కామ్ ప్రతినిధి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.