తిరుపతి నియోజక వర్గ పరిధిలో తొలగించబడిన ఓటర్ జాబితా ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్, కమిషనర్

Spread the love

తిరుపతి, :
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తేదీ 06.01.2022 నుండి 31.03.2023 వరకు ఓటర్ల జాబితాలో జరిగిన తొలగింపులను క్షేత్ర స్థాయిలో వెరిఫై చేయాలని ఇచ్చిన సూచనల మేరకు నేడు తిరుపతి నియోజకవర్గం లోని పలు పోలింగ్ బూత్ ల పరిధిలో నేటి వరకు తొలగించబడిన ఓటర్ జాబితాను క్షేత్ర స్థాయిలో ర్యాండమ్ గా జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి తిరుపతి ఈఆర్ఓ శ్రీమతి హరిత తో కలిసి తనిఖీ చేసారు.

ఉదయం తిరుపతి నియోజక వర్గంలో మారుతీ నగర్ రాయల్ నగర్ లోని 251, 252, 253, బైరాగి పట్టెడ 148 తదితర పోలింగ్ బూత్ ల పరిధిలోని గృహాలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ జాబితా నుండి తొలగించబడిన వారి వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తనిఖీ చేశారు. డబుల్ ఎంట్రీ అయిన, చనిపోయిన, మరొక ప్రాంతానికి తరలిపోయిన, వలస పోయిన తదితర కారణాల వలన తొలగించబడిన ఓటర్ల జాబితాను క్షేత్ర స్థాయిలో ర్యాండమ్ గా కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఏఈఆర్ఓ లు సంబంధిత బిఎల్ఓలు అందరూ పని చేయాల్సి ఉంటుందని పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అర్బన్ వెంకట రమణ, ఎలక్షన్ డి.టి జీవన్, సూపర్వైజర్లు బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page