మత్తు పదార్థాల నియంత్రణకు సమిష్టి కృషి

Spread the love

మత్తు పదార్థాల నియంత్రణకు సమిష్టి కృషి

జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి.

నంద్యాల, మార్చి 25:-

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మత్తు పదార్థాల నియంత్రణపై జిల్లా కోఆర్డినేషన్ కమిటీ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నియంత్రణకై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రధానంగా వ్యవసాయ, అటవీ శాఖలు తమ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో అక్రమంగా గంజాయి సాగును సంబంధిత క్షేత్రస్థాయి అదికారులతో గుర్తించి పూర్తిగా నియంత్రించాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులను గుర్తించి డి అడిక్ట్ సెంటర్ లలో ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు.

తూర్పు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గంజాయి మరియు డ్రగ్స్ పై నిఘా ఉంచి వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని SDPO లను ఆదేశించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులు సింథటిక్ డ్రగ్స్ వాడకుండా డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు ఇవ్వాలని, సంబంధిత మెడికల్ షాప్ యజమానులు ఆయా షాపులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డ్రగ్స్ కంట్రోల్ బోర్డు వారిని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, మరియు విద్యా సంస్థలలో డ్రగ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మరియు డ్రగ్స్ నియంత్రణ కమిటీల అధికారులను ఆదేశించారు. మున్సిపల్ పట్టణంలోని ముఖ్య కూడళ్లలో డ్రగ్స్ నియంత్రణపై హోర్డింగ్ లను ఏర్పాటు చేయాలని మరియు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ను ప్రదర్శించాలని మునిసిపల్ కమీషనర్ లను ఆదేశించారు. సచివాలయాల్లోని GMSK /WMSK లకు అప్పగించిన గ్రామాల పరిధిలో పర్యవేక్షిస్తూ డ్రగ్స్ , మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణ టోల్ ఫ్రీ నంబర్ 14500 ఏర్పాటు చేయడం జరిగిందని డ్రగ్స్ కు సంబందించి సమాచారాన్ని 14500 తెలియచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి డ్రగ్స్ సరఫరాకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు. ప్రతి నెల డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ సమావేశమై డ్రగ్స్ నియంత్రణ చర్యల గురించి సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకొంటామన్నారు.

డ్రగ్స్ నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో మరియు సివిల్ పోలీసులు కలిపి 8 కేసులు పెట్టడం, 80 కే‌జి ల గంజాయి సీజ్ చేసి 52 మంది ముద్ధాయిలను అరెస్టు చేయడం జరిగింది. ఇంకా 9 మంది ముద్దాయిలు పరారీ లో ఉండగా వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను యేర్పాటు చేయడం జరిగింది. ఎవరైన ఎక్కువ సార్లు మాదక ద్రవ్యాల కేసులో పట్టుబడితే పి‌డి యాక్ట్ పెట్టి జిల్లా నుండి బహిష్కరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మరియు జాయింట్ కలెక్టర్ గారితో పాటు అడిషనల్ ఎస్పి ఆర్.రమణ, DRO పుల్లయ్య, DM&HO వెంకటరమణ, సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ప్రసాదరావు, డి సి హెచ్ జఫరుల్లా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page