SAKSHITHA NEWS

బాధితులకు అండగా సీఎం సహాయనిది

బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు

అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. బాపట్ల నియోజకవర్గం బాపట్ల పట్టణం రైలు పేటకి కి చెందిన పోతన రాజ్యలక్ష్మి కి వైద్యఖర్చుల నిమిత్తం 4లక్షల రూపాయల చెక్కును బాధితులకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు.

ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి,బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు కికు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.


SAKSHITHA NEWS