SAKSHITHA NEWS

  • నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు & అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు ..
  • కౌన్సిలర్ కుటుంబానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి పరమార్శ అనంతరం మీడియా సమావేశం..

మీడియా సమావేశం ప్రధాన అంశాలు..
సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల w/0 బాలరాజు పై మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి జరిగిన ఖండించకపోవడం సిగ్గుచేటు అని గువ్వల మండిపడ్డారు. ఓట్లు జరిగినప్పటి నుండి ఇప్పటివరకు వంగూర్, అచ్చంపేట మండలాలలోని బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు.
పోలీసులు ప్రజల పక్షాన నిలవాలని ప్రభుత్వానికి వత్తాసు పలికినట్లు వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, భయభ్రాంతులకు గురిచేసిన వదిలి పెట్టేది లేదని, ఎవ్వరూ డ్యూటీ నిబంధనలు ప్రకారం వారు చేసుకుంటూ ముందుకు పోవాలని పోలీసులను హెచ్చరించారు.
దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్న చూసి చూడనట్టుగా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వారిపై దాడులకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీ మరియు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ నిరంకుశ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలకు ఏమైనా జరిగితే స్థానిక ఎమ్మెల్యే మరియు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS