SAKSHITHA NEWS

సూరారం డివిజన్ షాపూర్ నగర్ ఎంజెఎస్ గార్డెన్స్ తెలంగాణ ఎరుకల సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరుకల ఆత్మగౌరవ సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద హాజరవగా ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసిఆర్ పాలనా కొనసాగించారని, వారి పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్ధిక ప్రగతి సాగిస్తున్నారన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఎరుకల కులస్థుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పధకాలు ప్రారంభిచనున్నామన్నారు. ఎరుకల అభివృద్ధి కోసం 60 కోట్ల నిధులతో ప్రవేశపెట్టనున్న సంక్షేమ పధకాలను ముచ్చటగా మూడవ సారి ఏర్పడే ప్రభుత్వంలో ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర అధ్యక్షులు కూతాడి రాములు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాస్తపురం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బిజిలి ఎల్లేష్, సంఘ సభ్యులు కూతాడి రవి కుమార్, కేసారం మల్లేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు హెచ్ఎంటి పోచయ్య, కేసరం నాగులు, అంగిడి నారాయణ, కూతాడి విశ్వనాధ్, మహిళా అధ్యక్షురాలు కూరాకుల శ్యామల, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 17 At 7.04.54 Pm

SAKSHITHA NEWS