SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 24 at 5.06.07 PM

అసహాయులకు ‘ఆసరా’తో కొండంత అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ …

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ..*

చందానగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ మున్సిపల్ కల్యాణ మండపంలో జరిగిన దివ్యాంగుల పించన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు రూ.3016/- పెన్షన్‌ను రూ.4016/-కు పెంచిన శుభ సందర్బంగా 2785 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు , కార్పొరేటర్లుశ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , శ్రీమతి రోజాదేవి రంగరావు , నార్నె శ్రీనివాసరావు , ప్రాజెక్టు ఆఫీసర్లు శ్రీమతి ఉష రాణి గారు,శ్రీమతి నాగమల్లీశ్వరీ , ఇంద్రసేన తో కలిసి పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడని అన్నారు. ఇటీవల కాలంలో కన్న బిడ్డలే చూసుకొని ఈ తరుణంలో నెల నెల పెన్షన్ ఇస్తూ.. వెయ్యి రూపాయలు పెంచి వారికీ పెద్ద కొడుకుల సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అలాగే మంచి మమసున్న నాయకుడు మన సీఎం కెసిఆర్ అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని.
గత పాలకులు తెలంగాణ రాకముందు నెలకు 500 చొప్పున మాత్రమే అందించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్వయంపాలనలో అర్హులైన దివ్యంగులను గుర్తించేందుకు చర్యలు చేపట్టిందని తద్వారా వారి సంఖ్య 5 లక్షల 11వేల 656 పెరిగిందని తెలిపారు. నెలకు అందించే పింఛన్ ను రూ. 3,016 నుంచి రూ. 4,016 కు పెంచిందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అన్ని రాష్ట్రాలకంటే అధికంగా సామజిక భద్రతపై ప్రత్యేక
శ్రద్ధ పెట్టి అధికమొత్తాన్ని ఆర్ధిక సహాయంగా చెల్లిస్తుంది.
• వృద్యాప్య మరియు వితంతువులకు పెన్షన్ కొరకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు
• వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు నుండి ఇప్పుడు నాలుగు వేల పదహారు రూపాయలను ఇవ్వడం జరుగుతుంది .
• దేశంలో ఎక్కడ లేని విదంగా ఒంటరి మహిళకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు చెల్లించడం జరుగుతుంది.
• శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ఆసరా పింఛన్లు దాదాపు 18,272 (పద్దెనిమిది వేల రెండు వందల డెభై రెండు) లబ్ది దారులు ఈ పధకం ద్వారా ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు.
• శేరిలింగంపల్లి నియోజక వర్గంలో దాదాపు 2785 వికలాంగులకు పెంచిన పింఛన్ మంజూరు పత్రాలను అందజేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా

• అసహాయులకు ‘ఆసరా’తో కొండంత అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్…
• వృద్ధులకు ఆర్థిక భద్రత తో కూడిన ఆసరా వారి జీవితంలో వెలుగులు నింపినది అని, సంఘంలో సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆత్మవిశ్వాసం నింపినది అని
అందరికి ఆసరా అందిస్తూ ఇంటి పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి కేసీఆర్
నిలుస్తున్నారని.
• వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయస్సును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గింపు .
• ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో ఆసరా ఫించన్లు .
• రాష్ట్రంలో నూతనంగా 10 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం అని ,
• మొత్తం మీద 45 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనం అని రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల కోసం 12 వేల కోట్ల ఖర్చు చేస్తుంది


• వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ,చేనేత కార్మికులు, గీత కార్మికులకు, బీడి కార్మికులకు ప్రతి నెలా రూ. 2016/- మరియు వికలాంగులకు రూ. 3016 /- నుండి 4016 /- ఇవ్వడం జరుగుతుంది.
• గతంలో 70 రూపాయలు ఉన్న పెన్షన్ ను 200 రూపాయల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్థికంగా భారం అవుతున్న 2 వేలు,వికలాంగులకు 3 వేలకు పెంచి పెన్షన్ అందిస్తున్నారు.
• వృద్ధులు,వితంతులు,వికలాంగులు,ఒంటరి మహిళలకు,బీడీ కార్మికులకు,చేనేత,గౌడ కార్మికులకు, డయాలసిస్,బోధకాలు బాధితులకు కొండంత అండగా ఆసరా పథకం నిలుస్తుంది.
• సంక్షేమ,అభివృద్ధి సర్కార్ మనది…….కోవిడ్ వంటి విపత్కర కాలంలో కూడా అభివృద్ధి ,సంక్షేమం ఆపకుండా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది.
• జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి,వృద్ధులు తమ పిల్లలకు భారం కావొద్దని ఆలోచిస్తూ ఉంటారు, వారికి ఆసరాగా ఈ పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
• లింగంపల్లి లో ఒక అవ్వ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకు ఉండగా మాకేం సమస్య ఉంటది బిడ్డా అన్నది. ఇలా ఒక ధైర్యం ఇచ్చారు సీఎం కేసీఆర్ .

• మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి మహిళల నీటి కష్టాలు తీర్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి కేసీఆర్ .
• లింగంపల్లి లో ఒక అవ్వ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకు ఉండగా మాకేం సమస్య ఉంటది బిడ్డా అన్నది. ఇలా ఒక ధైర్యం ఇచ్చారు సీఎం కేసీఆర్ .
• పిల్లల చదువుల కోసం గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేశాం.
• నాడు కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతే.. ఇప్పుడు 24 గంటల కరెంటు వల్ల పెద్ద మొత్తంలో పంటలు పండుతున్నాయి


• అర్హులైన వారికి తప్పకుండా పింఛన్లు అందిస్తాము.
• ఇంటింటికి మంచినీళ్లు ఇస్తున్నాం, నిరంతర కరెంటు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, రైతుబంధు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, డబుల్ బెడ్ రూమ్లు ఇస్తున్నాం, కొత్త పింఛన్లు ఇస్తున్నాం.. ఇన్ని చేస్తున్న సీఎం కేసీఆర్ ని గుర్తించుకోవాలి .
• ఉచితాలు బంద్ చేయమని అనుచిత సలహా ఇస్తున్నారు బిజెపి వాళ్లు. అంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బంద్ చేయాలంట.
• బీజేపీ పాలిత రాష్ట్రాలలో 600 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తుంది అని
• తెలంగాణ లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు అని , దేశానికి మన పథకాలు దిక్సుచి లాగా మారాయి. అని ప్రభుత్వ వి గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి ,మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు,,గ్రంథలయా డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉట్ల కృష్ణ,వాలా హరీష్ రావు,అక్తర్, లక్ష్మారెడ్డి , ప్రసాద్, చింత కింది రవీందర్ గౌడ్, పద్మారావు, చాంద్ పాషా,ఓ.వెంకటేష్ ,రమేశ్ పటేల్,పోతుల రాజేందర్,పొడుగు రాంబాబు,అక్బర్ ఖాన్,కృష్ణ యాదవ్,గోవర్ధన్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,వెంకటేశ్వర రావు, దామోదర్,కాజా,అంజద్, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుధాకర్, సల్లావుద్దీన్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS