తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగమవుతుందన్న వాళ్లకే ఇదే చెంప పెట్టు సీఎం కేసీఆర్‌

Spread the love

తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు.

ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు

100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని ఆయన అన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు.

తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా ధృఢచిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని అన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న హెచ్‌ఎండీఏ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్‌ కుమార్‌ను కేసీఆర్‌ అభినందించారు.

కోకాపేటలో ఎకరానికి 100 కోట్లు

భూముల వేలంలో కోకాపేట కేక పుట్టించింది. ఒక ఎకరానికి వంద కోట్లకు పైగా పలికి రికార్డుల మోత మోగించింది. ఇది దేశంలోనే అత్యధిక ధరగా నమోదైంది. ఒక లేఅవుట్‌లో ఎకరం స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన దాఖలాలు లేవని, కోల్‌కతా నగరంలో ఎకరం సుమారు రూ. 72 కోట్ల మేర మాత్రమే పలికిందని నిర్మాణ రంగ నిపుణులు తెలిపారు. కోకాపేట నియోపోలిస్‌ ఫేజ్‌-2లో గల 3.6 ఎకరాల ప్రైమ్‌ ప్లాట్‌ను హెచ్‌ఎండీఏ గురువారం వేలం వేసింది. ఆ స్థలాన్ని హ్యాపీ హైట్స్‌, రాజపుష్ప సంస్థలు కలిసి రూ.362.72 కోట్లకు దక్కించుకున్నాయి. ఈ చిన్న సైజు ప్లాటుకు సరిగ్గా గండిపేట లేక్‌ వ్యూ ఉండటం, ప్లాటుకు రెండు వైపులా విశాలమైన రహదారి, పక్కన విశాలమైన ఓపెన్‌ స్పేస్‌, ఔటర్‌ రింగురోడ్డుకు అతి సమీపంగా ఉండటంతో అనూహ్యమైన ధర పలికింది. ఈ స్థలంలో దాదాపు 45 అంతస్థుల వరకు హైరైజ్‌ భవనాలను నిర్మించి, కనీసం 210 వరకు ఫ్లాట్లను కట్టే అవకాశం ఉంది. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు దిగ్గజ స్థిరాస్తి కంపెనీలు పోటీ పడగా.. వాటిలో హైదరాబాద్‌కు చెందిన కంపెనీలే దక్కించుకోవడం మరో విశేషం.

Related Posts

You cannot copy content of this page