బాపట్ల జిల్లా
ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయంముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగానే ఇంటికీ
రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మాట్లాడలేని దద్దమ్మ జగన్
` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
బాపట్ల : ఎన్నికలంటే సీఎం జగన్‌కు భయమని ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగా ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దమైయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పేర్కోన్నారు. బాపట్లలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుడు పేర్ని నాని భయంతో మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారన్నారు. 87 శాతం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పధకాలు అందుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఎకమైన మమ్ములను ఏమి చేయలేవని మాట్లాడుతున్నారన్నారు. 87 శాతం మంది ప్రజలకు అందిస్తే ధైర్యం ఉంటే ఎన్నికలు అంటే భయం ఎందుకు వస్తుందన్నారు. చంద్రబాబును 175 సీట్లు పోటీ చేయాలని, పవన్ కళ్యాణ్ 175 సీట్లలో పోటీ చేయాలని సీపీఐ నారాయణ రామకృష్ణ ఎర్ర జెండా పట్టుకుని తెలుగుదేశంతో ఎందుకు కలుస్తున్నారంటున్నావ్ మేము కలిస్తే నీకు ఎందుకయ్యా 87 శాతం మందికి సంక్షేమ పధకాలు ఇచ్చినప్పుడు ఎవరు కలిస్తే నీకు ఎందుకు భయంతో మాట్లాడుతున్నావని స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. అధికార పార్టీ వైసీపీ భయానికి కారణం మొన్న జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఓటరికి రూ.వెయ్యి, ఉపాధ్యాయ ఓటరుకు ప్రోద్దుటూరులో రూ. 10 వేలు ఇచ్చి కోట్లాది రుపాయాలు ఖర్చు పెట్టిన ప్రజలు తీర్పు ఎలా ఇచ్చారన్న చూశారు కదా అన్నారు. ఉత్తరాంధ్రలో పట్టభద్రులు మాకు ఓటు వేస్తే రాజధాని విశాఖపట్నం ఉగాది నాటికి సీఎం ఇక్కడే కుర్చుంటారని ప్రచారం చేసిన ఉత్తరాధి ఓటర్లు తిరస్కరించి చిత్తుచిత్తుగా ఓడిరచారన్నారు. రాయలసీమ మా నాయకుడు రాజధాని పెడుతున్నాడని అబద్ధపు ప్రచారాలు చేసిన కోట్లు ఖర్చు చేసిన బెదిరించిన మిమ్ములను ఓడిరచి పులివెందుల వ్యక్తే గెలిచారన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే నీ పీడ ముందుగానే రాష్ట్రంకు వీడిపోతుందన్నారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశావో చెప్పాలని రామకృష్ణ సీఎం జగన్‌కు చాలెంజ్ చేశారు. వ్యవసాయ రంగం, ఇరిగేషన్, పారిశ్రామిక రంగం, ఐటీ సెక్టారులో ఎక్కడైన ఒక్క అభివృద్ధి కార్యక్రమమైన చేశావా మీడియా సాక్షిగా వెళుదమా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల ముందు చెప్పిన వాగ్ధానాలు ఏమి సక్రమంగా అమలు చేశావో చెప్పాలన్నారు. మద్యపాన నిషేదం దశలవారీగా అని అధికారంలో వచ్చిన తరువాత మద్యపానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందా పెరిగిందా సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో నాడ్‌ు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే కాదు ఎంపీ స్థానాలు కూడా ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతా ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రచారం చేసుకున్నావన్నారు. వైసీపీకి నేడు లోక్‌సభ, రాజ్యసభలో 31 మంది ఎంపీలు ఉన్నా ఏం సాధించావని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించావా, విభజన హామీలు సాధించావా,కడప స్టీలు ప్యాక్టరీ తెచ్చావా, రామాయపట్నం స్టీలు ప్యాక్టరీ తెచ్చావా, విశాఖ రైల్యే జోన్‌కు నిధులు తీసుకువచ్చావా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రవేటీకరణ చేస్తున్న మాట్లాడలేని దద్దమ్మ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాళ్లు పట్టుకోవటమే తప్ప రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఏమైన అడిగా అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దివాళ చేసి అప్పులు పాలు చేస్తున్నావన్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోయిన జగన్ మాట్లాడటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2900 కోట్లు రూపాయలు ఇవ్వమని అడుగుతున్నా ఇవ్వక పోగా మీకు రావాల్సింది 1429 కోట్లే అంతకు మించి ఇవ్వమని చెపుతున్నారన్నారు. ఏడాదికి 1500 కోట్లు ఇస్తే గానీ మూడేళ్లలో పూర్తికాని పరిస్థితి నెలకొందన్నారు. జాతీయ ప్రజెక్టుగా ప్రకటించి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా వివాదస్పదమైన సెంట్రల్ వాటర్ కమీషన్ అనుమతులు లేని భద్ర ప్రాజెక్టుకు కర్ణాటకలో ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ 5300 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించారన్నారు. ఇంతజరుగుతున్నా ఏమైన మాట్లాడుతున్నావా అని జగన్‌ను ప్రశ్నించారు. రాష్ట్రానికి జగన్ చేసింది ఏమీ లేదు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని సీఎం పీఠం దిగేనాటికి రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండబోతుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల 79 వేల కోట్లలో అప్పులు కట్టేందుకే సరిపోతాయన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచిస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు జరిగిన తగురీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. తప్పులు సరిదిద్దుకోకుండా మీరు ఎందుకు కలుస్తారూ మీరు ఎందుకు పోటీ పెట్టరు మేము ఎం చేయాలో మేము చేసుకుంటాం ప్రజల ఆలోచన తెలుసుకునే వైసీపీ బెంబేలెత్తుతుందని అందుకే అవాకులు చవాకులు పేల్చుతున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు లౌకిక శక్తులతో కలిసి ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కి అక్రమ కేసులు బనాయించి జైలులో పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఉందన్నారు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ óనాయకుడు రాహుల్‌గాంధీ 2019లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు కేసులు పెట్టి రెండేళ్లు శిక్ష విధింపజేసి లోక్‌సభ నుంచి డిస్ క్వాలీఫై చేశారన్నారు. అంతటితో ఆగకుండా డిల్లీలో రాహుల్ గాంధీ క్వార్టర్‌ను కూడా ఖాళీ చేయమన్నారంటే ఎంత దుర్మార్గంగా మెడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందో అర్ధమవుతుందన్నారు. మైనార్టీ వర్గాలు దేశంలో అభద్రతాబావంతో జీవిస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాదానాలు లేవన్నారు. అదానీ లక్షల కోట్లు దోచుకుంటున్నారే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నా ప్రతిపక్షాలు అన్నీ చర్చకు డిమాండ్ చేస్తున్నా ప్రతిపక్షాలు దొంగలు అని ప్రచారం చేస్తున్నారన్నారు. మేము దొంగలమా నీవు దొంగవో చర్చ జరిగితే తేలుతుందన్నారు. నిజాయితీ సచ్చీలుడవైతే పార్లమెంట్‌లో జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలన్నారు. దేశంలో పెరిగిన మతోన్మాదం, అధిక ధరలు, నిరుద్యోగం, రైతుల అల్పాదాయ విషాయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు నుంచి భారీ ఎత్తున 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 జిల్లాలో ఎర్రజెండా ఆద్వర్యంలో బీజేపీ హాటావో దేశ్‌కో బచావో ప్రచార కార్యక్రమాలను నిర్వహించన్నుట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు జంగాల అజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి.నాగాంజనేయులు,జిల్లా నాయకులు జేబీ శ్రీధర్ ఉన్నారు.