సాక్షిత :*మరో గొప్ప మానవీయ సంక్షేమ పథకం ఇది!..
- డ్రాపౌట్స్ తగ్గించి పోషకాహారం లోపాన్ని అధిగమించడంలో గణనీయంగా పాత్ర పోషించే బెస్ట్ స్కీమ్ ఇది
*సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించి విద్యార్థుల తో కలిసి బ్రేక్ పాస్ట్ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని మండల ప్రాథమిక పాఠశాల లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,MEO వెంకటయ్య , కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి , జగదీశ్వర్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి విద్యార్థుల తో కలిసి బ్రేక్ పాస్ట్ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ . ఈ పథకంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా గా ఉంది అని. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి విద్యార్థుల తరుపున ,నా తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల విద్యార్థులకు ఉపయోగపడుతుంది అని .
మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 73 ప్రభుత్వ పాఠశాలలో 22,000 విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
దేశంలో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే ఒకే ఒక్క
రాష్ట్రం తెలంగాణ రాష్టం అని. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుంది. సీఎం కేసీఆర్ ఒక పథకం అమలు చేసే ముందు ప్రజా కోణంలో ఆలోచిస్తారు. అందుకే అవి విజయవంతం అవుతున్నాయి. సామాజిక మార్పుకు కారణం అవుతున్నాయి. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
కళ్యాణ లక్ష్మి రూ. లక్ష ఇచ్చే పథకం మాత్రమే కాదు.
కళ్యాణ లక్ష్మి బాల్య వివాహాలను తగ్గించింది. చట్టాలు చేయలేనిది పథకం చేసింది.
కేసీఅర్ కిట్ 16 వస్తువులు ఇచ్చే పథకం మాత్రమే కాదు, కేసీఅర్ కిట్ వల్ల వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయి.
మిషన్ భగీరథ అంటే ఇంటింటికీ నల్లాలు మాత్రమే కాదు, మిషన్ భగీరథ వల్ల సురక్షిత తాగునీరు అందుతున్నది. తద్వారా సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.