SAKSHITHA NEWS


Clothes distribution program during Christmas celebrations

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి లో క్రిస్టమస్ వేడుకల సందర్భంగా జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తో కలిసి క్రిస్టియన్ సోదరి సోదరమణులకు బట్టలను పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల వారిని ఆదరిస్తూ అందరి అభిమానాలను చూరగొంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ని, ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతస్థుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని, పేద ప్రజలకు ఒక తండ్రిగా ఒక పెద్ద అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండగను పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరి సోదరమణులకు బట్టలు పంపిణి చేయడం జరిగినది అని అందులోభాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట లో గల సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి లో అర్హులైన పేద క్రిస్టియన్లకు క్రిస్మస్ బట్టలను పంపిణీ చేయడం జరిగినది అని, క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పేద క్రిస్టియన్లకు నూతన బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని, బతుకమ్మ పర్వదినంనా బతుకమ్మ చీరలు , రంజాన్ పర్వదినంనా మైనారిటీ సోదరులకు కానుకలు ,క్రిస్టియన్ వారికీ క్రిస్టమస్ కానుకలు అందించడం జరుగుతుంది

అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు అదేవిధంగా ప్రతి పేదవాడు పండుగ రోజు సంతోషంగా జరుపుకోవడానికి బట్టలు పంపిణి చేయడం జరిగినది అని ,ప్రతి ఒక్కరు సంతోషంగా పండుగను జరుపుకోవాలని .ఎంతో పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని,


క్రిస్మస్ సోదర సోదరిమనులకు ముందస్తు కిస్టమస్ శుభకాంక్షలు తెలియచేస్తునని ,అర్హులైన ప్రతి పేద వారికీ అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాస్టర్లు RP దాస్, విపర్తి,చిట్టిబాబు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ నాయకులు సుబ్బారావు, జగన్మోహన్ రావు, చెరుకూరి బెనర్జీ, హన్మంతరావు, ఎంవి రావు ,క్రిస్టియన్ సోదరి సోదరమణులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS