తిరుపతి సిటీ ఆపరేషన్ సెంటర్ పనులు ఆలస్యం అవుతున్నాయని, అనుకున్న కాల పరిమితి మేరకు సకాలంలో పనులను పూర్తి చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో గతంలో ఉన్న పాతబడిన కార్యాలయాన్ని నేలమట్టం చేసి అదే స్థానంలో సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మిస్తూ ఉండడం, అందులో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ కెమెరాలతో పర్యవేక్షణతో కూడిన భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
సిఓసి భవనాన్ని నిర్మిస్తున్న గుత్తేదారులతో కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ పనులు ఆలస్యం అవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ మరో ఐదు నెలలోపు ఐదు స్లాబులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేస్తూ పనులు ఆలస్యం కాకుండా వేగవంతం చేసేందుకు ప్రతిరోజు పర్యవేక్షించాలని, పనులు పూర్తి అయ్యేంతవరకు ప్రతిరోజు రిపోర్టును తనకు కచ్చితంగా అందజేయాలని సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ కు కమిషనర్ హరిత ఐఏఎస్ తగు ఆదేశాలు జారి చేసారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏయికామ్ సంస్థ ప్రతినిధి భాలాజీ తదితరులు పాల్గొన్నారు.