SAKSHITHA NEWS

చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు హైదరాబాద్ విమానాశ్రయంలో నారా లోకేష్ తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
-రేణిగుంట విమానాశ్రయం నుండి నారా లోకేష్, ఇతర టీడీపీ నేతలతో కలిసి బయటకు వస్తున్న శిష్ట్లా లోహిత్

  • చిత్తూరు జిల్లా కారాగారం ఎదుట మీడియాతో మాట్లాడుతున్న నారా లోకేష్ చిత్రంలో శిష్ట్లా లోహిత్ కూడా ఉన్నారు
  • నారా లోకేష్ తో కలిసి చిత్తూరు జిల్లాలో పర్యటించిన శిష్ట్లా లోహిత్
  • రేణిగుంట ఎయిర్పోర్ట్ లో టీడీపీ శ్రేణుల ఘనస్వాగతం
  • రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణబద్దులై ఉంటాం
  • ఎన్ని కేసులు ఎదుర్కోవడానికైనా సిద్ధమవుతాం
  • జైళ్ళకు వెళ్ళడానికైనా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు
  • టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

………

సాక్షిత చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చిత్తూరు జిల్లాలో పర్యటించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయం వరకు నారా లోకేష్ తో ఒకే విమానంలో శిష్ట్లా లోహిత్ కూడా ప్రయాణించారు. ఈ సందర్భంగా రేణిగుంట ఎయిర్పోర్ట్ లో దిగిన నారా లోకేష్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయని శిష్ట్లా లోహిత్ చెప్పారు. వేలాది మంది కార్యకర్తలకు నారా లోకేష్ అభివాదం చేస్తూ పర్యటనను కొనసాగించారన్నారు. అడుగడుగునా నారా లోకేష్ ను శాలువాలతో సత్కరించి బొకేలను అందజేశారన్నారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో రేణిగుంట ఎయిర్పోర్ట్ పరిసరాలు మార్మోగాయని చెప్పారు. వందలాది మంది నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారని తెలిపారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన చిత్తూరు సబ్ జైలుకు బయలుదేరారన్నారు. కుప్పంలోని అన్నా క్యాంటీన్ పై జరిగిన దాడి ఘటనలో ప్రతిఘటించి అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులుతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలను నారా లోకేష్ పరామర్శించారన్నారు. అనంతరం చంద్రగిరి, పెరుమాలపల్లె ప్రాంతాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ ఉన్మాద పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కంకణబద్ధులై ఉంటామని చెప్పారు. ఇందు కోసం ఎన్ని కేసులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. జైళ్ళకు వెళ్ళడానికి కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అమలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ పర్యటనల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న వైసీపీ నాయకులను ఎందుకు హౌస్ అరెస్ట్ లు చేయలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శిష్ట్లా లోహిత్ చెప్పారు.


SAKSHITHA NEWS